- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori : యూట్యూబర్లపై పోలీసులకు అఘోరీమాత సోదరుడి ఫిర్యాదు... క్లారిటీ ఇచ్చిన పోలీసులు
మంచిర్యాల జిల్లా నెన్నెల కుశ్నపల్లికి చెందిన అఘోరీ మాత సోదరుడు ఎల్లూరి రమేష్ యూట్యూబర్ల పై చర్య తీసుకోవాలని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుతున్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా నెన్నెల కుశ్నపల్లికి చెందిన అఘోరీ మాత సోదరుడు ఎల్లూరి రమేష్ యూట్యూబర్ల పై చర్య తీసుకోవాలని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుతున్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అఘోరీ మాతపై యూట్యూబర్లు తప్పుడు కథనాలతో తమ కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎంతో కాలానికి తమ సోదరుడు ఎల్లూరి శ్రీనివాసు (అఘోరీ మాత) ఇంటికొచ్చారని ఎల్లూరి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు చక్కెర్లు కొగుతున్నాయి.
అఘోరీ మాతను రకరకాల ప్రశ్నలతో, ఇంటర్వ్యూల పేరుతో తమ కుటుంబాన్ని వేధించారని బాధితుడు వాపోయారని, తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసినట్టు ప్రచారం అవుతుంది. అంతేకాకుండా భయాందోళనకు గురిచేశారని, యూట్యూబ్ మీడియాపై తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ పోలీసులను కోరాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అఘోరీ మాత సోదరుడు నుంచి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని నెన్నెల ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.






