ఏడాది గడిచినా ఖాళీగా AEO పోస్టు

by Batti.Sumithra |

కుబీర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి (AEO)ను ఇతర మండలానికి డిప్యూటేషన్‌ పై పంపించి సంవత్సరం గడుస్తున్నా, ఇప్పటికీ కొత్త అధికారిని నియమించలేదు.

ఏడాది గడిచినా ఖాళీగా AEO పోస్టు
X

దిశ, కుబీర్ : కుబీర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి (AEO)ను ఇతర మండలానికి డిప్యూటేషన్‌ పై పంపించి సంవత్సరం గడుస్తున్నా, ఇప్పటికీ కొత్త అధికారిని నియమించలేదు. ఇటీవల మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభ సమయంలో, కుబీర్ క్లస్టర్ AEOను డిప్యూటేషన్‌ పై ఎందుకు పంపించారంటూ రైతులు, ప్రజాప్రతినిధులు AOను నిలదీశారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నమోదు, టోకెన్ల పంపిణీ తదితర అవసరాల కోసం ఇన్‌చార్జ్ AEO వద్దకు వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం కస్ర క్లస్టర్ AEO ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ క్లస్టర్ పరిధిలోని పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ జిల్లా అధికారులు వెంటనే రెగ్యులర్ AEOను నియమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్‌ను వివరణ కోరగా, క్లస్టర్ AEOను డిప్యూటేషన్‌పై పంపిన విషయం నిజమేనని తెలిపారు. పంటల కొనుగోళ్ల సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా AOను అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.

Next Story