హైదరాబాద్ అందాలు తిలకించిన ఆదివాసీలు

by Batti.Sumithra |

అడవి బిడ్డలకు పట్టణం అంటే ఏమిటో తెలియని వారికి ‘విజ్ఞాన యాత్ర’ పేరుతో హైదరాబాద్‌ను చూపిస్తున్నారు.

హైదరాబాద్ అందాలు తిలకించిన ఆదివాసీలు
X

దిశ, ఉట్నూర్ : అడవి బిడ్డలకు పట్టణం అంటే ఏమిటో తెలియని వారికి ‘విజ్ఞాన యాత్ర’ పేరుతో హైదరాబాద్‌ను చూపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి అడవి బిడ్డలు రావడంతో చారిత్రక కట్టడం తారామతి బారాదరి ప్రాంగణం పులకించిపోయింది. గూడెం వాసుల రాకతో ఆ ప్రాంతమంతా వేడుక వాతావరణాన్ని తలపించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట, దొంగచింత గ్రామాల నుంచి రెండో విడత ఆదివాసీ విజ్ఞాన యాత్రలో భాగంగా సుమారు 450 మంది ఆదివాసీలను ప్రభుత్వం తరఫున రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు 11 టూరిజం బస్సుల్లో ఇటీవల హైదరాబాద్‌కు తరలించారు.

ఈ పర్యటనలో భాగంగా కుమ్మరికుంట, దొంగచింత బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బారాదరి, అలాగే వినోద కేంద్రాలైన లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్, శిల్పారామంను దర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పర్యటన వివరాలను తెలుసుకున్నారు. పర్యటన వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను కూడా వివరించారు. ఈ పర్యటనలతో గిరిజన బిడ్డలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story