- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీ మహిళలకు రక్షణ కరువైంది
by Ratna Kumari |
జిల్లాలో ఆదివాసీ గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పర్దాన్ మహిళ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వందన ఆరోపించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో ఆదివాసీ గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పర్దాన్ మహిళ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వందన ఆరోపించారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీ గిరిజన మహిళలకు పెళ్లి ఉపాధి, డబ్బుల పేరిట ఆశచూపి కొందరు దళారులు వారిని మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని చెప్పారు. నిందితులపై పోలీసులు కఠిన శిక్షలు అమలు చేయకపోవడం వల్ల.. జిల్లాలో మహిళల అక్రమ రవాణా సాగుతోందని వాపోయారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేసి.. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించి.. మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
Next Story






