రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

by Bhanu |

ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ రహదారి దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ రహదారి దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. తలమడుగు మండలం దేవాపూర్ కు చెందిన షేక్ నసీర్(55) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు వస్తుండగా వెనక నుండి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story