- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఆదిలాబాద్ : 2013 బ్యాచ్కు సంబంధించిన పోలీసు జాగిలం తార గురువారం మృతి చెందగా జిల్లా ఎస్పీ అఖిల్ మహత్యం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించిన జిల్లా ఎస్పీ పోలీస్ జాగిలం తార అందించిన సేవలను దాని పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పేలుడు పదార్థాలు కనుగొనడంలో సేవలందించి, ఈరోజు స్వర్గస్తులవడంపై ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతక్రియలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని పోలీసు జాగిలం తారకు శాలువా, పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. తార అందించిన సేవలకు జిల్లా ఎస్పీ సెల్యూట్ చేస్తూ తన సేవలకు సరైన గౌరవం అందించారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు జాగిలం తార పేలుడు పదార్థాలను కనబడడంలో, విఐపి లు జిల్లా పర్యటన సందర్భంగా భద్రతా విషయంలో తనిఖీల నిర్వహించడంలో జాగిలం తార విశేషమైన సేవలు అందించిందని కొనియాడారు. పోలీస్ జాగిలాలు అన్నింటికి మించి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎండాకాలం దృష్ట్యా ప్రతి ఒక్క జాగిలానికి కూలర్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు డి వెంకట్, టి మురళి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పి రమేష్, టి తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.






