జిల్లాలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం..

by Bhanu |

జిల్లాలో పోలీసులు గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

జిల్లాలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం..
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో పోలీసులు గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు గురువారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ ముఖ్య కార్యాలయంలో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి ని పూర్తిగా నిర్మూలించేవరకు జిల్లా పోలీసు యంత్రాంగం తగిన చర్యలను చేపడుతుందని తెలిపారు. గంజాయి వర్తక దారులను, పండించే వారిని, వినియోగదారులను అణచివేస్తామని అన్నారు.


ముఖ్యంగా యువతకు, మారుమూల గ్రామాలలోని ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించి, వాటి వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసి, చైతన్యపరచడం జరుగుతుందని అన్నారు.గత నెల 10 వతేది నుండి ఇప్పటివరకు జిల్లాలో 34 గంజాయి కేసులు నమోదయ్యాయనీ,అందులో 56 మంది నిందితులను అదుపులోకి తీసుకొని జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు నమోదైన కేసులలో 12 కిలోల డ్రై గాంజా,181గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ 23,21,550 ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా గంజాయి, మాదక ద్రవ్యాల పై ఎలాంటి సమాచారం అయినా 8712659973 నంబర్ కు వాట్స్అప్ ద్వారా తెలియజేయాలని కోరారు.




Next Story