- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..
పోలీసు వ్యవస్థలో పదోన్నతితో విధుల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : పోలీసు వ్యవస్థలో పదోన్నతితో విధుల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందుతున్న 10 మంది కానిస్టేబుల్ లకు గురువారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి,అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతితో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. జిల్లాలో 10 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..
మొత్తం 28 మందికి పదోన్నతిరాగా అందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పదిమంది ఉండటం సంతోషకరం అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న పదిమంది సిబ్బందికి నిర్మల్, జగిత్యాల్ జిల్లాలు కేటాయించడం జరిగిందనీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన సిబ్బందిని పోలీసు ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి చిహ్నాన్ని అలంకరించారు.
పదోన్నతి పొందిన సిబ్బంది, ఆదిలాబాద్ జిల్లా నుండి బదిలీ అయిన స్థానం.
1) జి సుభాష్ - నిర్మల్
2) ఈ సుదర్శన్ - నిర్మల్
3) ఎ ప్రకాష్ రెడ్డి -నిర్మల్
4) ఎం వీర ప్రకాష్ - నిర్మల్.
5) బి గంగారెడ్డి - నిర్మల్.
6) పి శివాజీ - జగిత్యాల్.
7) ఏం రమణ - జగిత్యాల్.
8) డి వెంకటి - జగిత్యాల్.
9) లక్ష్మణరావు - జగిత్యాల్.
10) ఏ వెంకటరమణ - జగిత్యాల్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






