కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్

by Ratna Kumari |

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ చార్జి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్
X

దిశ, ఆదిలాబాద్ : ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ చార్జి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్ రెడ్డి ,పత్తి ముజ్జు, కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

Next Story