- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన నామినేషన్ పత్రాలను ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన నామినేషన్ పత్రాలను ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ దాఖలకు ముందు సతీమణి రమతో కలిసి సర్వమత ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న తన అనుచరులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మరోసారి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు.
గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎంతో సుపరిపాలన అందించాలని గతంలో సౌకర్యాలు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చినప్పుడే ప్రజలు సంక్షేమ పథకాలను పొంది అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, తదితర నాయకులు ఉన్నారు.






