చైన్ సిస్టం పేరిట మోసం.. డ్రగ్స్ అమ్ముతూ ఒకరు అరెస్ట్.. ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు..

by Bhanu |

అత్యాశతో ఫ్రాడ్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ లెక్చరర్ సత్యనారాయణ అనే వ్యక్తి వాట్సప్ గ్రూపు తయారు చేసి చైన్ సిస్టం పేరుతో బోనస్లు వస్తాయంటూ పలువురిని మోసం చేశాడని ఎస్పీ పేర్కొన్నారు.

చైన్ సిస్టం పేరిట మోసం.. డ్రగ్స్ అమ్ముతూ ఒకరు అరెస్ట్.. ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు..
X

దిశ ఆదిలాబాద్ : అత్యాశతో ఫ్రాడ్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ లెక్చరర్ సత్యనారాయణ అనే వ్యక్తి వాట్సప్ గ్రూపు తయారు చేసి చైన్ సిస్టం పేరుతో బోనస్లు వస్తాయంటూ పలువురిని మోసం చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన ఐదుగురు డాలర్లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని మోసం చేయగా వారిపైనా కేసులు పెట్టామన్నారు.

ఇదిలా ఉంటే.. మత్తు పదార్థాలను అమ్ముతున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన దహికాంబ్లే వికాస్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.నిందితుడి నుంచి 3 డ్రగ్ బాటిల్స్,స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు.మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఎక్కువ రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పారు.పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

దీంతోపాటు.. ఆదిలాబాద్ పట్టణంలోని పంచవతి హోటల్‌లో బుధవారం ఓ గదిలో ఆన్లైన్ గేమ్ ఆడి అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.అక్కడ కొంతమంది ఆన్లైన్ గేమ్ ఆడుతూన్నారనే పక్కా సమాచారంతో.. పోలీసు సిబ్బంది తనిఖీ చేశారన్నారు.ఇందులో ఐదుగురు వ్యక్తులు ఉండగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నమని ఒకరు పరారైనట్లు తెలిపారు.ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు.

Next Story