- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి:అదనపు కలెక్టర్
by Jakkula.Mamatha |
ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.

X
దిశ, మామడ: ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరికి పనులను కల్పించాలని, కూలీల సంఖ్య పెంచాలని అదే విధంగా కొలతల ప్రకారం.. పని చేయాలని దాని ప్రకారమే వేతనాలు చెల్లింపు జరుగుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంతసేపు నీడలో విశ్రాంతి తీసుకోవాలని, మంచినీరు, మజ్జిగ అధికంగా తాగాలని కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి విజయలక్ష్మి, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, ఏపీవో శివాజీ, సర్పంచ్ చంద్రకళ సురేందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్, టి ఏ సురేష్, కూలీలు పాల్గొన్నారు.
Next Story






