అభివృద్ధి ప‌నుల‌పై నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు : మంత్రి వివేక్ వెంక‌ట్ స్వామి

by Ratna Kumari |

దిశ‌, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్

అభివృద్ధి ప‌నుల‌పై నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు : మంత్రి వివేక్ వెంక‌ట్ స్వామి
X

దిశ‌, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై పురోగతి, జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సాండ్ బజార్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇసుక తిప్పలు లేకుండా చేశామని ఆయన అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గతంలో ఇసుక అవసరం ఉంటే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని ప్రస్తుతం సాండ్ బజారు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. అనంతరం జల్ సంచయ్ జన్ భాగిదారి నేషనల్ అవార్డు 2025 అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story