- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి ఏరియా స్టోర్‌లో బ్యాటరీల దొంగతనం.. నిందితులు అరెస్ట్
మందమర్రి సింగరేణి ఏరియా స్టోర్స్‌లో జరిగిన బ్యాటరీల దొంగతనం కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు.

దిశ, మందమర్రి: మందమర్రి సింగరేణి ఏరియా స్టోర్స్‌లో జరిగిన బ్యాటరీల దొంగతనం కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 25 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు మందమర్రి సీఐ రమేష్ వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే.. ఈ నెల 25వ తేదీన శనివారం ఏరియా స్టోర్స్‌లో బ్యాటరీలు మాయమైనట్లు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మందమర్రి ఎస్సై గోపతి నరేష్ తన సిబ్బందితో కలిసి నార్లాపూర్ గ్రామ సమీపంలోని హైవేపై వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో పోలీసులను చూసి అనుమానస్పదంగా కనిపించడంతో వెంటనే ఆటోను తనిఖీ చేయగా అందులో దొంగిలించిన 25 బ్యాటరీలు లభ్యమయ్యాయి.
ఆటోలో ఉన్న ముగ్గురు యువకులను విచారించగా, ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి సమయంలో తామే ఏరియా స్టోర్స్‌లోకి చొరబడి బ్యాటరీలను దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు. అరెస్టయిన ముగ్గురు నిందితులు ఇరవై ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ధనకుంట్ల మునియప్ప , జన్నే నరేంద్ర, గాజుల శివప్రసాద్ మందమర్రికి చెందిన యువకులు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధి సమయంలోనే కేసును ఛేదించి దొంగలను పట్టుకున్న ఎస్ఐ జి. నరేష్‌తో పాటు సిబ్బంది రాకేష్, మహేష్, కృష్ణ, శ్రీనివాస్‌లను సీఐ పర్స రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్తుల దొంగతనానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ హెచ్చరించారు.






