- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పు తీర్చలేదని మహిళ దారుణ హత్య నిందితుడి అరెస్ట్
అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కొమరం భీమ్ జిల్లా దహేగాం మండలంలో వెలుగుచూసింది.

దిశ కాగజ్ నగర్ : అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కొమరం భీమ్ జిల్లా దహేగాం మండలంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్ళగూడ గ్రామానికి చెందిన ఆత్మకూరి కళావతి (36), ఆమె భర్త సంతోష్ నాలుగేళ్ల క్రితం ఇల్లు కట్టుకోవడానికి అదే గ్రామానికి చెందిన వగాడే బడే రామ్ @ బడే రావ్ (49) వద్ద రూ. 40,000 అప్పుగా తీసుకున్నారు. గత కొంతకాలంగా డబ్బుల విషయంలో కళావతికి, బడే రామ్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కళావతిని చంపేస్తానని బడే రామ్ గతంలోనే బెదిరించాడు. బుధవారం (జనవరి 28న) ఇట్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు వీరిద్దరూ హాజరయ్యారు. మీటింగ్ ముగిసిన తర్వాత నిందితుడు మద్యం సేవించి తన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, ఇట్యాల శివార్లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కళావతి కనిపించింది. మంచి అవకాశం దొరికిందని భావించిన నిందితుడు, తన బైక్‌తో ఆమెను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. కిందపడిన కళావతి నిందితుడితో గొడవపడి, జరిగిన విషయం ఊరిలో అందరికీ చెప్పి పరువు తీస్తానని, కేసు పెడతానని హెచ్చరించింది. దీంతో భయపడిన బడే రామ్, ఆమె బతికి ఉంటే తన పరువు పోతుందని మరియు డబ్బులు కూడా రావని భావించి ఆమెపై దాడి చేశాడు. ఆమె చీర కొంగుతోనే గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని సుధాకర్ అనే వ్యక్తికి చెందిన పత్తి చేనులో పడవేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు వగాడే బడే రామ్‌ను వద్ద నుండి హత్యకు ఉపయోగించిన హెచ్ఎఫ్ డీలక్స్ నెం: TG20-9635 మోటార్ సైకిల్ రక్తపు మరకలు ఉన్న నిందితుడి షర్ట్ వస్తువులను అదుపులోకి తీసుకున్నారు అనంతరం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.






