- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్య కేసులో నిందితుడి అరెస్టు.. ఏఎస్పీ చిత్తరంజన్
by Batti.Sumithra |
హత్య కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు.

X
దిశ, ఆసిఫాబాద్ : హత్య కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. మంగళవారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు 1.11.2025 లో తిర్యాణి మండలంలోని పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంత్ రావును మంత్రాలు చేస్తున్నారనే నెపంలో మంగికి చెందిన వినోద్ గొడవతో దాడి చేసి హత్య చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వినోద్ ను అరెస్టు చేసి.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచగా..! వాష్ రూమ్ అని చెప్పి. పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యాడు. పోలీసుల నాలుగు నెలల గాలింపు తర్వాత మంగళవారం ఉదయం గోలేటీ ఎక్స్ రోడ్డు ఆటో స్టాండ్ వద్ద అతడిని పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు.
Next Story






