- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు: ఎస్పీ అఖిల్ మహాజన్
ధాబాలలో మద్యం సేవించి రహదారిపై వాహనాలు నడపడం వల్లనే వాహన ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

దిశ,గుడిహత్నూర్: ధాబాలలో మద్యం సేవించి రహదారిపై వాహనాలు నడపడం వల్లనే వాహన ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి పై, అంతరాష్ట్ర రహదారిపై ఉన్న ధాబా యజమానులు, నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ఉన్నధాబాలల్లో రోడ్లపై లారీలు, ఇతర వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా గల ధాబాలలో మద్యం సేవించడం మద్యం అమ్మడం, గంజాయి మాదకద్రవ్యాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రతి ధాబా లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్క సీసీటీవీ కెమెరా 100 మందితో సమానం అన్నారు. ధాబాకు వచ్చే ప్రతి వాహనం ధాబా పార్కింగ్ స్థలంలోనే పార్క్ చేయాలన్నారు. ధాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు నేరస్తులు పాల్పడే విషయాలను మాట్లాడిన ఆయుధాలు కనిపించిన గంజాయి, మాదకద్రవ్యాలు వంటి సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీసులకు సమాచారం అందించే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. ధాబాలలో నిజాయితీగా పని చేసి సక్రమ మార్గంలో సంపాదించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రిత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ. ఎల్ జీవన్ రెడ్డి, ఇచ్చోడ ఎస్ హెచ్ఓ. కె నరేష్ కుమార్, గుడిహత్నూర్ ఎస్సై. ఎల్ శ్రీకాంత్ ధాబా యజమానులు తదితరులు పాల్గొన్నారు.






