- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తుల స్వీకరణ : జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ
దిశ, మందమర్రి : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ, రాష్ట్రానికి

దిశ, మందమర్రి : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ, రాష్ట్రానికి చెందిన అర్హత, నైపుణ్యం/అర్థ నైపుణ్యం గల కార్మికులకు విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. టామ్ కామ్ గ్రీస్ లో హాస్పిటాలిటీ, నిర్వహణ, సేవా రంగాలలో వివిధ పాత్రలలో 1 వేయి విదేశీ ఉద్యోగ అవకాశాలను పొందిందని, హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లమా/డిగ్రీ అర్హత కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఉచిత వసతి, భోజనం, బీమా అందించడం జరుగుతుందని, చివరి నెల జీతంతో విమానం టికెట్ ఖర్చులు తిరిగి చెల్లించబడతాయని, 8 గంటల పని+ 45 నిమిషాల విరామం, అదనపు పనిగంటలకు అదనపు వేతనం ఉంటాయని, ఆంగ్ల భాషలో నైపుణ్యం కలిగి ఉండాలని, వీసా, ఖర్చులు అభ్యర్థి వహించాలని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ నవీకరించబడిన రెజ్యూమ్ ను [email protected] కు ఈ - మెయిల్ చేయాలని, ఇతర వివరాలకు 9440052081, 9440051452 నంబర్లు, వెబ్ సైట్ www.tomcom.telangana.gov.in లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.






