అన్న కాపాడే య‌త్నంలో ప్రాణాలు కోల్పోయిన త‌మ్ముడు

by Ratna Kumari |

దిశ‌, ప్ర‌తినిధి నిర్మ‌ల్ : అన్న‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అన్న‌తో పాటు త‌మ్ముడు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నాయుడు వాడకు చెందిన

అన్న కాపాడే య‌త్నంలో ప్రాణాలు కోల్పోయిన త‌మ్ముడు
X

దిశ‌, ప్ర‌తినిధి నిర్మ‌ల్ : అన్న‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అన్న‌తో పాటు త‌మ్ముడు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నాయుడు వాడకు చెందిన మాన్పురి నరేష్ అనే యువకుడు ఇంట్లో జరిగిన చిన్న వివాదంతో మానసిక ఒత్తిడితో పట్టణంలోని బంగల్ పేట్ చెరువు లో దూకి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన తమ్ముడు నవీన్ పరుగున వెళ్లి అన్నను కాపాడే యత్నంలో చెరువులో దూకాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు చెరువులో జల సమాధి అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story