- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వెళ్లిపోయిందని.. మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువకుడు
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనతో ఉండనని చెప్పి వెళ్ళిపోయిందని మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

దిశ, లోకేశ్వరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనతో ఉండనని చెప్పి వెళ్ళిపోయిందని మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన యువతి లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన పిల్లికర్ యోగేష్(25)లు బంధువులు, కాగా వీరు ఇరువురు గత నెల 15న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇరువురు కలిసి హైదరాబాద్ లో నాలుగు రోజులపాటు నివాసం ఉన్న తర్వాత మృతుని స్వగ్రామం పుస్పూర్‌కు వచ్చారు.
ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మాయితో పెళ్లి జరిపిస్తామని చెప్పి అమ్మాయిని వెంట తీసుకెళ్లినట్లు తెలిపారు. వారం రోజుల తర్వాత యువతిని సంప్రదించేందుకు మృతుడు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేకపోవడంతో యోగేష్ బంధువులను వెంటబెట్టుకొని మాలేగాం గ్రామానికి వెళ్ళగా యువతి రానని చెప్పడంతో మనస్థాపం చెంది ఈ నెల 5న పురుగుల మందు తాగగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని మృతుని సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






