- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడు ఆత్మహత్య
దిశ, లక్షేట్టిపేట : పట్టణంలో క్లబ్ రోడ్డులో లంబాడి తాండాకు చెందిన రాతోడ్ మణికంఠ అనే(20) యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు

X
దిశ, లక్షేట్టిపేట : పట్టణంలో క్లబ్ రోడ్డులో లంబాడి తాండాకు చెందిన రాతోడ్ మణికంఠ అనే(20) యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు ఎస్సై గోపతి సురేష్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మంచిర్యాలలో ఐటిఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత పధి రోజుల నుంచి ఇంట్లో తల్లితండ్రులను బైక్ కోనివ్వమని వెంటపడుతున్నాడు. నిన్న సాయంత్రం కూడా బైక్ కొనియ్యాలని కోరగా.. తల్లితండ్రులు తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. మృతుని తండ్రి దారాసింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






