- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ ఢీ కొని మహిళా మృతి
ట్రాక్టర్ ఢీ కొని మహిళా మృతి చెందిన సంఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.

X
దిశ, రామకృష్ణాపూర్ : ట్రాక్టర్ ఢీ కొని మహిళా మృతి చెందిన సంఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రెండో జోన్ కి చెందిన చిట్టి మల్లీశ్వరి(39) అక్కడికక్కడే మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అమరవాది చెరువు నుంచి పూడిక మట్టిని తీసుకొని ఏరియా ఆసుపత్రి, రాజీవ్ చౌక్ మీదుగా భగత్ సింగ్ నగర్, విఠల్ నగర్ వైపు ట్రాక్టర్లు అతివేగంగా నడుపుతున్నారు. రామకృష్ణాపూర్ నుంచి మందమర్రికి ద్విచక్ర వాహనం పై వచ్చే క్రమంలో భగత్ సింగ్ నగర్ వద్ద ట్రాక్టర్ అతివేగంగా వచ్చి మహిళను ఢీ కొట్టింది. దీంతో మహిళా మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై జాడి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






