ఇంటి ముందే యువ‌కుడిపై అడ‌వి పంది దాడి

by Ratna Kumari |

ఇంటి ముందు నిలబడి ఉన్న సమయంలో అడవి పంది పంట పొలాల నుంచి ఒక్కసారిగా వచ్చి యువకుడి పై దాడి చేసిన ఘటన గురువారం మండలంలోని హాస్నాపూర్ లో చోటు చేసుకుంది.

ఇంటి ముందే యువ‌కుడిపై అడ‌వి పంది దాడి
X

దిశ, ఉట్నూర్ : ఇంటి ముందు నిలబడి ఉన్న సమయంలో అడవి పంది పంట పొలాల నుంచి ఒక్కసారిగా వచ్చి యువకుడి పై దాడి చేసిన ఘటన గురువారం మండలంలోని హాస్నాపూర్ లో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రవీణ్ అనే యువకుడు తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అక‌స్మాత్తుగా పంట పొలాల నుంచి ఓ అడవి పంది పరుగులు తీసుకుంటూ ఆ యువకుడి పై విచక్షణ రహితంగా దాడి చేసింది. ఆ యువకుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అక్క‌డికి వ‌చ్చారు. దాడి చేసి అడ‌వి పంది ప‌రార్ అయింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. జనావాసాల్లోకి వ‌చ్చి అడవి పంది దాడి చేయడంతో అక్క‌డి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story