- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరులకు స్వేచ్చా నివాళి
ఆదివాసీ గిరిజన అమరవీరుల సంస్మరణ దినం రోజున అధికారికంగా అమరవీరులకు ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు.

దిశ, ఉట్నూర్ : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారిగా పోలీసు ఆంక్షలు లేకుండా సోమవారం ఆదివాసీ గిరిజన అమరవీరుల సంస్మరణ దినం అధికారికంగా అమరవీరులకు ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. 1981 ఏప్రిల్ 20న జల్, జంగల్, జమీన్ పేరిట నినాదించి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, జిల్లా ఆదివాసీలు ఘననివాళులు అర్పించారు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పూజలు ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడానికి మండలంలోని వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మండల కేంద్రంలోని గోండుగూడ గ్రామ పటేల్ మడావి ఇంద్రు ఇంటి నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించి ఆదివాసీల ఆరాధ్య దైవం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో స్తూపం వద్దకు చేరుకొని ఎరుపు రంగు జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ గిరిజనులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
నివాళ్ళు అర్పించిన ప్రముఖులు..
ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మృతివనంలో సోమవారం నిర్వహించిన వేడుకలకు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీ సోయం బాపూరావ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ నరేష్, ఆత్రం సుగుణక్క, ఆదివాసి నాయకులతో కలిసి స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారికంగా సంస్కరణ దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అలాగే స్థలం ఇప్పించి స్థలం పై ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇప్పించారని, స్మృతి వన అభివృద్ధి భాగంగా కాంపౌండ్ వాల్ పై సోలార్ కరెంటు అలాగే బోర్ వెల్ మంజూరు చేయించామని, అటవి ప్రాంతాలలో ఉన్న గిరిజన గుడాలల్లో ఇళ్ల సమస్య త్రీ ఫేస్ సమస్య వాటర్ సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. ఆదివాసీలకు ఆర్వోఎఫ్ఆర్ ద్వారా భూహక్కు కల్పించామని పేర్కొన్నారు. ఏజెన్సీలోని సమస్యలను పరిష్కరించేలా ఐటీడీఏ పీఓ, అటవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. స్మృతి వనాన్ని 15 లక్షలతో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్రం భుజంగ రావు రచించిన ఆ గాయానికి 44 ఏళ్లు పేరిట ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు స్తూపం వద్ద, పరిసర ప్రాంతంలో ఉట్నూర్ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ ఇంద్రవెల్లి ఘటనలో మిగిలిన అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళ్లు అర్పించేందుకు గతంలో ఇబ్బందులు పడ్డారని కేసీఆర్ ప్రభుత్వంలో నివాళి ఆంక్షలను సడలింపు ఇవ్వడంలో స్వేచ్చగా నివాళి అర్పించారన్నారు. ఎస్సీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గిరిజన ప్రజలకు అందే స్కీం పై అవగాహన కల్పించాలని, ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమని తెలిపారు. ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ స్మృతి వనస్థూపం అభివృద్ధి మూడు నెలల్లో పూర్తి అయ్యే విధంగా చూస్తామని తెలిపారు. అలాగే గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి సమస్య తలెత్తకుండా కావలసిన బోర్వెల్, బావి ఇంజనీరింగ్ శాఖ ద్వారా మంజూరు అయ్యే విధంగా చూస్తామని అన్నారు. విద్య అనేది విద్యార్థులకు భవిష్యత్తు విద్యార్థుల చదువు మానేయకుండా చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని గ్రామ పటేళ్లకు, సార్ మేడి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడీలు, పటేళ్లు, ఆదివాసి ప్రజలు పాల్గొన్నారు.






