జాతరకు పటిష్ట బందోబస్తు

by Nallavelli.Anjaneyulu |

రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహించనున్న గంగాపూర్ జాతర సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తతో విధులు నిర్వహించాలని కొమరం భీం ఎస్పీ నితిక పంత్ సూచించారు.

జాతరకు పటిష్ట బందోబస్తు
X

దిశ ,రెబ్బెన : రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహించనున్న గంగాపూర్ జాతర సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తతో విధులు నిర్వహించాలని కొమరం భీం ఎస్పీ నితిక పంత్ సూచించారు. శుక్రవారం గంగాపూర్ లో పోలీస్ అధికారులు సిబ్బందితో ప్రత్యేక డ్యూటీ సమావేశం నిర్వహించారు . సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జాతరకు 282 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు సమర్థవంతంగా నిర్వహించాలని ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మహిళలు పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనుమానాస్పద వ్యక్తులు వస్తువులపై నిగా పెంచాలని అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని కేటాయించిన విధులలో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు గంగాపూర్ జాతరను శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు ఈ జాతరకు 282 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట పోలీస్ బందోబస్తు నియమిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎస్పి వైదుద్దీన్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, రెబ్బెన సీఐ సంజయ్ ఎస్సై వెంకటకృష్ణ ,వాంకిడి సీఐ సత్యనారాయణ, ఆర్ఐ అంజన్న తిర్యాని ఎస్సై వెంకటేష్, ఇతర ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story