- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > మంత్రి వివేక్ పై అలక.. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రహస్య సమావేశం ?
మంత్రి వివేక్ పై అలక.. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రహస్య సమావేశం ?
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వివేక్ వెంకట స్వామి పద్ధతులు నచ్చక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

X
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వివేక్ వెంకట స్వామి పద్ధతులు నచ్చక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనిస్తూ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన విషయం ఇంకా మరువకముందే, పట్టణంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పై అసంతృప్తితో సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ రహస్య సమావేశం పై మంత్రి స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Next Story






