- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గులాబీ దండు వెంట ఎర్ర జెండా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో పురపాలక సంఘాల ఎన్నికలు కొత్త పొత్తులకు దారితీశాయి.

దిశ, నిర్మల్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో పురపాలక సంఘాల ఎన్నికలు కొత్త పొత్తులకు దారితీశాయి. తాజా పరిణామాలు రానున్న రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు సహా పంచాయతీ పురపాలక సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సీపీఐ పార్టీ కమ్యూనిస్టుల స్వర్ణోత్సవ సభకు సైతం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల బలం, బంధం మరింత పెరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పశ్చిమ జిల్లాలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు నడుమ మున్సిపల్ ఎన్నికల పొత్తుల వ్యవహారం సాధారణంగానే ఉన్నప్పటికీ... సీపీఐకి బలం ఉన్న సింగరేణి ప్రాంతంలో మాత్రం తీవ్ర విభేదాలు తలెత్తాయి. తాజా పరిణామాలు రానున్న ఉన్న రోజుల్లో కాంగ్రెస్ సీపీఐ నడుమ తెగ తెంపులకు దారి తీసేలా కనిపిస్తున్నాయి.
మంత్రి వివేక్పై తిరుగుబాటు...
తూర్పు జిల్లాకు సంబంధించి చెన్నూరు శాసనసభ్యుడు కార్మిక శాఖ రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద పై సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటియుసి, సిపిఐ కమ్యూనిస్టు నేతలు తిరుగుబాటుకు దిగారు. సింగరేణి కార్మికుల్లో గట్టి పట్టు కలిగి ఉన్న ఏఐటీయూసీ జాతీయ నేత వాసిరెడ్డి సీతారామయ్య ప్రత్యక్షంగానే మంత్రి వివేక్ పై ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన స్వయంగా అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటున్నానని చెబుతూనే... పొత్తు ధర్మం తప్పు అయినప్పటికీ మంత్రి వివేక్ తీరును తప్పుపడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో గులాబీ పార్టీతో దోస్తీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి వివేక్ తన అనుచరుల తప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీతో తాము దూరం అయ్యామన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. అయితే రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందని మంచిర్యాల జిల్లాలోని క్యాతన్ పల్లి పుర పాలక సంఘంలో మాత్రం పొత్తు ఇకపై ఉండదని స్పష్టం చేశారు.
గులాబీ దండుతో ఎర్రజెండా...
తాజాగా తూర్పు జిల్లాలోని ఖ్యాతన్ పల్లి పురపాలక సంఘంలో రాష్ట్రస్థాయిలో ఉన్న మిత్ర బంధానికి వ్యతిరేకంగా పొత్తులు కుదిరాయి. ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను విభేదించిన సిపిఐ గులాబీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది ఈ మున్సిపాలిటీలో 22 మున్సిపల్ వార్డులు ఉండగా 15 చోట్ల భారత్ రాష్ట్ర సమితి ఏడు చోట్ల సిపిఐ పోటీ చేసేలా పొత్తు కుదురుచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సభ వేదికపై కమ్యూనిస్టులు పాల్గొనడం తాజా రాజకీయ పరిణామాలను ఆసక్తిగా మార్చాయి. రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్లు గులాబీ పార్టీతో వైరం ఉన్న కమ్యూనిస్టులు... ఈ ఒక్క మున్సిపాలిటీలో పొత్తుకు దిగడం చర్చకు దారితీస్తున్నది. కాగా మంత్రి వివేక్ ఆయన సోదరులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో సింగరేణి ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టులకు విభేదాలు ఉన్నాయని తాజా పరిణామాలు బెల్లంపల్లి చెన్నూరు మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.






