ఘోర ప్రమాదం:ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి..!

by Malleboina Mahesh |

జైపూర్ తాళామోడ్‌లో ఘోర ప్రమాదం.. గోడ కూలి శిథిలాల కింద 15 మంది కార్మికులు పూర్తి జలమయం, ముగ్గురు మృతి చెందినట్లు అనుమానం!

ఘోర ప్రమాదం:ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి..!
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని తాళామోడ్ (Talamod) ప్రాంతంలో సోమవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భారీ ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 15 మంది నిర్మాణ కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విపత్తులో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, విపత్తు నిర్వహణ బృందాలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది జెసిబి (JCB) యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. మట్టి, ఇటుకల దిబ్బల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యులయ్యారు. తీవ్రంగా గాయపడిన పలువురిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story