సిట్ చీఫ్‌కు అంబటి లేఖ.. సాయికృష్ణ ఉదంతంపై ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |

సిట్ చీఫ్‌కు అంబటి లేఖ.. సాయికృష్ణ ఉదంతంపై ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ(Gade Sai Krishna) ఉదంతంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఆయన లేఖ రాశారు. సాయికృష్ణ హత్య ఎలా జరిగిందో చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే సాయికృష్ణ మృతదేహాన్ని ఎవరు, ఎలా మాయం చేశారని ప్రశ్నించారు. అంతేకాదు సాయికృష్ణ కేసులో క్రిమినల్ లయబిలిటీని ఒక్క సీఐ నాగరాజుకే ఎందుకు పరిమితం చేశారని లేఖలో నిలదీశారు. ‘‘కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ విషయం ఏమైంది.. ఎందుకు నిర్లక్ల్యం చేశారు. ఫుటేజ్ ఓవర్ రైట్, డిలీట్, టాంపర్ కాకుండా చర్యలు చేపట్టారా లేదా. అసలు సీసీ ఫుటేజ్‌ను ఎవరు ధ్వంసం చేశారు. సీఐ నాగరాజుతో పాటు అధికారులకు సంబంధించిన ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు పరిశీలించారా లేదా..?. మే 28న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు.’’ అని లేఖలో అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Next Story