పాత నేతలు వ‌ద్దంటూ.. కొత్త నేత‌ల ఆందోళ‌న‌

by Disha Web Desk 23 |
పాత నేతలు వ‌ద్దంటూ.. కొత్త నేత‌ల ఆందోళ‌న‌
X

దిశ‌,ఆదిలాబాద్ : స‌స్పెన్ష‌న్‌కు గురైన నేత‌ల‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవ‌ద్ద‌ని వారిపై స‌స్పెన్ష‌న్ వేటు కొన‌సాగాల్సిందేన‌ని కంది శ్రీనివాస్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవరెడ్డిల‌ను పార్టీ స‌స్పెండ్ చేయ‌గా, వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారి వ్య‌తిరేక వ‌ర్గం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంగళవారం రాత్రి తిరిగి పార్టీలో చేరిన ఆ ముగ్గురు నేత‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్య‌క్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆ నేతలను పార్టీలో చేర్చుకోవద్దని, సస్పెన్షన్ య‌థావిధిగా కొనసాగించాలని ప్రజా భవన్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆరేళ్ల పాటు విధించిన సస్పెన్షన్ వేటును ఐదు నెలలకే ఎత్తివేయడం ఏమిట‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వారిని పార్టీలో చేర్చుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండ్ర‌త్ సుజాత, సాజిద్ ఖాన్ వర్గంతో కలిసి పని చేయమ‌ని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆలోచించి వారిపై సస్పెన్షన్ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆందోళ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నేత‌లు ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ కొత్త‌గా పార్టీలో చేరిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story

Most Viewed