పలు దొంగతనాలకు పాల్పడిన వ్య‌క్తి అరెస్ట్, రిమాండ్

by Ratna Kumari |

పలు దొంగతనాలకు పాల్పడిన దొంగ హైదరాబాద్ నుంచి వస్తున్నాడని పక్కా సమాచారంతో ఉట్నూర్ బస్టాండ్ లో ఆ దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ ఎస్సై విజయ్ పేర్కొన్నారు.

పలు దొంగతనాలకు పాల్పడిన వ్య‌క్తి అరెస్ట్, రిమాండ్
X

దిశ, ఉట్నూర్ : పలు దొంగతనాలకు పాల్పడిన దొంగ హైదరాబాద్ నుంచి వస్తున్నాడని పక్కా సమాచారంతో ఉట్నూర్ బస్టాండ్ లో ఆ దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ ఎస్సై విజయ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందారే సిద్ధేశ్వర నేరస్థుడు గతంలో బాధితురాలు. ఈనెల 16న అందారే వనిత ఆమె దగ్గర నుంచి ఆటోలో వెళ్తుండ‌గా.. రూ.60వేలు లాక్కొని పారిపోయాడు. అలాగే 2025లో అక్టోబర్ నెలలో ఎవ్వరూ లేని సమయం చూసి బాధితురాలు వేల్పుల రాజమణి అను ఆమె ఇంట్లో చొరబడి 23 వేల రూపాయలు కాజేశాడు. అదే సంవత్సరంలో అక్టోబర్ నెలలో ప్రమోద్ ఇంట్లో 29 వేల రూపాయలు కాజేశాడు. అలాగే 2023లో మరికొందరి ఇంట్లో డబ్బు కాజేసినట్టు ఎస్సై విజయ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉట్నూర్ బస్టాండ్ కి వస్తున్నాడనే సమాచారం మేరకు కానిస్టేబుల్ నరేష్ తో కలసి పట్టుకున్నామని ఆయన తెలిపారు.

Next Story