రైలు ప‌ట్టాల కింద ప‌డి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, త‌లమ‌డుగు : రైలు ప‌ట్టాల కింద త‌ల పెట్టి వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న త‌ల‌మ‌డుగు మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. తలమడుగు

రైలు ప‌ట్టాల కింద ప‌డి వ్య‌క్తి మృతి
X


దిశ‌, త‌లమ‌డుగు : రైలు ప‌ట్టాల కింద త‌ల పెట్టి వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న త‌ల‌మ‌డుగు మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన హర్ష ముక్తుల వెంకటి ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ స‌భ్యులు వెతికారు. అయినా ఫ‌లితం లేదు. దీంతో రైలు ప‌ట్టాల కింద త‌ల‌పెట్టి ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని స‌మాచారంతో కుటుంబ స‌భ్యులు అక్క‌డి వెళ్లారు. దీంతో హ‌ర్ష ముక్తుల వెంక‌టి రైలు ప‌ట్టాల కింద త‌ల పెట్టాడ‌ని తెలుస్తోంది. రైలు ప‌ట్టాల కింద త‌ల పెట్ట‌డంతో త‌ల ఓవైపు.. మొండం మరోవైపు ప‌డ‌టంతో అంద‌రూ భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. ఎవ్వ‌రైనా కావాల‌నే చంపి అక్క‌డ ప‌డేశారా..? లేక రైలు కింద ప‌డి చ‌నిపోయాడా..? అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

Next Story