- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమారుడి చితికి తలకొరివి పెట్టిన తల్లి
దిశ, తాండూర్ : వృద్ధాప్యంలో కన్నుమూశాక.. తన చితికి చిన్న కుమారుడే నిప్పు పెడతాడని భావించిన ఆ తల్లికి.. తీరని శోకం మిగిలింది. చేతికందొచ్చిన ఇద్దరు కొడుకులు ఏడాదిలోపే

దిశ, తాండూర్ : వృద్ధాప్యంలో కన్నుమూశాక.. తన చితికి చిన్న కుమారుడే నిప్పు పెడతాడని భావించిన ఆ తల్లికి.. తీరని శోకం మిగిలింది. చేతికందొచ్చిన ఇద్దరు కొడుకులు ఏడాదిలోపే మృతి చెందడంతో ఆ తల్లి బాధ వర్ణతీతం. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ కు చెందిన సలాకుల రాజమ్మ భర్త సింగరేణిలో పనిచేస్తూ చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. భర్త మృతి అనంతరం రాజమ్మ సింగరేణిలో పని చేస్తూ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. దాదాపు ఏడాది క్రితం రాజమ్మ పెద్ద కుమారుడు సలాకుల రమేష్ మృతి చెందాడు. పెద్ద కుమారుడి మరణాన్ని మరిచిపోక ముందే చిన్న కుమారుడు సలాకుల నరేష్ గురు వారం సాయంత్రం ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. చిన్న కుమారుడు నరేష్ కు ఒక కూతురు ఉంది. రాజమ్మ దుఃఖాన్ని, బాధను దిగమింగుకుని శుక్రవారం మధ్యాహ్నం చిన్న కుమారుడి దహన సంస్కరాలు నిర్వహించి కుమారుడి చితికి తల్లే కొరివి పెట్టింది. ఆ తల్లి బాధను చూసి బంధువులు, గ్రామస్థుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.






