- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : గుమ్ముల శ్రీనివాస్
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుమ్ముల.శ్రీనివాస్ అన్నారు.

దిశ, మంచిర్యాల : కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుమ్ముల.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన 24 గంటల నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ డిమాండ్లు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారన్నారు. గత 40 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉద్యమాలు కొనసాగుతున్న దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఏ ఒక్క డిమాండ్లను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం డిమాండ్స్..
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారంగా బీసీ సామాజిక రక్షణ భద్రత కై బీసీ ఆక్ట్ ఏర్పాటు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రద్దు, 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేత, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలును ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అమలుపరిచి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు, బీసీ యాక్ట్, ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పిన హామీలు నెరవేర్చాలన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు.
బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించేందుకు ముందుకు రావాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీక్షలో పాల్గొన్న వారికి న్యూ ఇండియా పార్టీ డాక్టర్.జేవీ రాజు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దంపేట.శంకర్, తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేన్నెల.నరసయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. నీలకంఠేశ్వర రావు దీక్ష చేపట్టిన వారికి మద్దతు పలికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు న్యాయవాది కర్రే.లచ్చన్న, గజెల్లి.వెంకటయ్య, రామగిరి.రాజన్న చారి, కొత్తకొండ. రమేష్, మంచెర్ల.సదానందం, చంద్రగిరి.చంద్రమౌళి, కీర్తి.బిక్షపతి, ఎర్రోళ్ల.రాజు, సురేంద్ర.చారి, శెట్టిపల్లి.గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.






