- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవ్వాల్‌లో పిచ్చి కుక్క స్వైరవిహారం
by Jakkula.Mamatha |
మండలంలోని కవ్వాల్ గ్రామంలో శనివారం ఉదయం నుంచి ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తుంది.

X
దిశ, జన్నారం: మండలంలోని కవ్వాల్ గ్రామంలో శనివారం ఉదయం నుంచి ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తుంది. ఇప్పటికే ఒక చిన్న ఆవు దూడతో పాటు సుమారు ఐదు ఆవుల పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు. వీధుల్లో తిరిగేటప్పుడు, పొలం పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని గ్రామంలోని అందరికీ తెలియజేసి, గ్రామస్తుల మరియు పశువుల రక్షణ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పిచ్చి కుక్క కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Next Story






