- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేకమెట్ట ఎన్కౌంటర్‌కు నిరసనగా భారత మావోయిస్ట్ పార్టీ కీలక నిర్ణయం..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా టేకమెట్ట వద్ద జరిగిన బూటకపు ఎన్కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర బంద్ పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.

దిశ, బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా టేకమెట్ట వద్ద జరిగిన బూటకపు ఎన్కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర బంద్ పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఆయన లేఖ విడుదల చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓ ఇన్ ఫార్మర్ ద్రోహి ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర సీ - 60 కమాండోస్, తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ ఫోర్స్ 500 మంది దళాన్ని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు చేశారని పేర్కొన్నారు.
పదుల సంఖ్యలో మోటారు షెల్స్‌తో బీభత్సం సృష్టించిన.. చివరకు ఎన్కౌంటర్ కట్టు కథ అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లో కామ్రేడ్స్ అనిత (డివిసిఎం), అశోక్ (పీఎం) అమరులయ్యారని తెలిపారు. వీరితో పాటు ఈ ఎన్కౌంటర్లో గాయపడి పోలీసులకు పట్టుబడిన గ్రామస్తుడిని కాలు విరిచి విచక్షణ రహితంగా కొట్టి వారి వెంట తీసుకువెళ్లారని తెలిపారు. పోలీసులు అతడిని చంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్‌లో పోలీసులు పట్టుకున్న గ్రామస్తుడిని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. అమరులైన కామ్రేడ్స్‌కు జగన్ విప్లవజోహారులు అర్పించారు. వారి ఆశయాలను చివరి దాకా కొనసాగిస్తామని ఆయన శపథం చేశారు. టేక మెట్ట బూటకపు ఎన్కౌంటర్‌ను ప్రజా స్వామిక వాదులు, మేధావులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.






