ఎన్నికల ముందు కాషాయ పార్టీలో భారీ కుదుపు

by Disha Web Desk 9 |
ఎన్నికల ముందు కాషాయ పార్టీలో భారీ కుదుపు
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాషాయం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆ పార్టీ తీవ్రమైన అపవాదును ఎదుర్కొంటోంది. పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి పార్టీకి చెందిన కొందరు నేతలు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని సోయం ఎదురుదాడి చేస్తున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు రాథోడ్ రమేష్ బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వ్యూహాత్మకంగా బాపూరావును దెబ్బతీసేందుకు యత్నాలు చేస్తున్నారని సోయం వర్గీయులు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్: పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి పార్టీకి చెందిన కొందరు నేతలు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని సోయం ఎదురుదాడి చేస్తున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు రాథోడ్ రమేష్ బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వ్యూహాత్మకంగా బాపూరావును దెబ్బతీసేందుకు యత్నాలు చేస్తున్నారని సోయం వర్గీయులు ఆరోపిస్తున్నారు.

సోయం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ప్రతిపక్షాలకు ఆయుధం

ఎంపీ సోయం బాపూరావు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఎంపీ లాడ్స్ నిధులను సొంతగా వాడుకున్నానని, ఇల్లు కట్టుకున్నానని, కొడుకు పెళ్లి చేశానని వ్యాఖ్యానించిన మాటలు వీడియోలు పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై మీడియాలో భిన్న రకాల కథనాలు వచ్చాయి. అంతర్గత సమావేశంలో జరిగిన విషయాలు బయటకు ఎలా పొక్కాయని ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజంగానే నిధులు ఫ్రాడ్ చేశారా ఏదైనా సందర్భంలో సోయం అలా మాట్లాడారా అన్నది తేలాల్సి ఉంది. నిధులు సొంతగా వాడుకోకపోయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం బాధ్యతరాహిత్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలకు మంచి ఆయుధంగా మారింది. బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం మంజూరు చేసే నిధులను సొంతగా వాడుకున్నాడని, ఎంపీ స్వయంగా కార్యకర్తల సమక్షంలో ప్రకటించారని దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విచారణ జరిపితే నిజంగానే నిధులు దుర్వినియోగమైనట్లు అయినట్లు తేలితే ఎంపీ సోయంపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

సోయంపై కుట్ర జరిగిందా?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల ఏకీకరణ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తుడుం దెబ్బ పేరిట అనేక పోరాటాలు చేసిన సోయం బాపూరావు రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదురుచూశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పాస్ పోర్ట్ వివాదాల్లో చిక్కుకొని అభాసు పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనూహ్యగా బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ముక్కుసూటిగా మాట్లాడతారని మనసులో ఏది లేకుండా ఉంటారని ఆయనకు పేరు ఉంది.

యథాలాపంగా మాట్లాడిన మాటలే రాజకీయంగా బాబూరావుకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు సొంత పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీలోనే కొందరు సీనియర్లు ఆయనకు పొగ పెడుతున్నారని సోయం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనను దెబ్బతీసేందుకే కుట్ర స్వయంగా సోయం బాపూరావు మీడియాతో వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై భారతీయ జనతా పార్టీలో భిన్న రకాలుగా మాట్లాడుతున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులపై ప్రభావం..

ఎంపీ సోయం వ్యవహారం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో దీనిపై ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. బాధ్యత కలిగి ఉన్న పార్లమెంటు సభ్యుడే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్టు ఒప్పుకున్నారని అలాంటి పార్టీకి ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ వ్యవహారం రాజకీయంగా తమకు తలనొప్పిగా మారడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.

అధిష్టానం ఆరా..

ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు పార్టీ సీనియర్ నేతలతో జరిగిన వ్యవహారంపై పూర్తి నివేదిక కోరినట్లు తెలిసింది. సోయం బాపూరావుతోపాటు ఈ వ్యవహారం వెనుక ఉన్నవారెవరు వీడియో లీకేజీకి కారణం ఎవరన్న అంశంపై పూర్తి నివేదిక సమర్పించాలని బండి సంజయ్ ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Also Read..

సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్



Next Story

Most Viewed