- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదరగొట్టిన అతిధి గుసాడీలు
దిశ, తలమడుగు : ఆదివాసీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండగలలో అతి ముఖ్యమైన పండగ గుసాడి దండారి. ఈ దండారి 10 రోజుల పాటు ఆదివాసీలు

దిశ, తలమడుగు : ఆదివాసీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండగలలో అతి ముఖ్యమైన పండగ గుసాడి దండారి. ఈ దండారి 10 రోజుల పాటు ఆదివాసీలు ఎక్కడుంటే అక్కడ డోలు చప్పులతో గుసాడీల నృత్యాలతో గ్రామమంతా ఒక పండగ వాతావరణం నెలకొల్పుతారు. మండలంలోని ఝరి పున్నగూడ గ్రామానికి బోథ్ మండలానికి చెందిన పాట్నాపూర్ గుసాడీ దండారీలు అతిథులుగా విచ్చేశారు. వారికి స్థానికంగా ఉన్న గుసాడీలు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. దాదాపుగా వంద మందికి పైగా ఒకే చోట గుసాడీలు నృత్యం ఆడుతుంటే ఆటను చూడడానికి ఇతర గ్రామాల నుంచి వందలాది సంఖ్యలో జనాలు తరలివచ్చారు. వాళ్ళు చేస్తున్న గుసాడి నృత్యాలు కనువిందుపరిచాయి. అతిథులుగా వచ్చిన గుసాడీలను స్థానికులు ఘనంగా సత్కరించారు. అన్ని మర్యాదలలో ఆదివాసీ మర్యాద అదో ప్రత్యేకం వారికి కావలసిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకొని అతిథులుగా వచ్చిన గుసాడీలను ఆట పాటలతో సాంస్కృతిక ఆదివాసీ నృత్యాలతో ఆనందంగా సాగనంపారు. ఈ కార్యక్రమంలో పటెల్ కుమ్ర గంగాధర్, కుమ్ర జ్ఞానేశ్వర్, మహాజన్ సీడం లక్ష్మణ్, కోవా భీంరావ్ ,మాధవ్ ,చత్రపతి గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.






