- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం :కలెక్టర్ కుమార్ దీపక్
డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల : డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, ఈగల్ ఫోర్స్ సీఐ.రవికుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధుల తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మందుల దుకాణాల నిర్వాహకులు వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ప్రజలకు మందులను విక్రయించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృశ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. నిష్టాతులైన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజల సొంత ఆలోచన ప్రకారం మందులు, సిరప్ లు వినియోగించకూడదన్నారు. వైద్యులను సంప్రదించి సూచన మేరకే మందులను వినియోగించాలన్నారు.
నార్కోటిక్ నిషేధిత డ్రగ్స్ విక్రయం వినియోగం పై ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మందుల దుకాణాల నిర్వాహకులు సమిష్టిగా ఉండాలన్నారు. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందులను విక్రయించకూడదన్నారు. అర్హత అనుమతి తప్పనిసరి కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడు పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డి - అడిక్షన్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్.అనిత, ఆస్పత్రి పర్యవేక్షకులు వేద వ్యాస్, ఆర్.ఎం. ఓ భీష్మతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్, నర్సింగ్ అధికారులు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ, మాస్ మీడియా అధికారి బుగ్గ వెంకటేశ్వర్లు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






