పింఛను కోసం వికలాంగురాలి ఎదురుచూపులు..

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-28 14:22:50  IST  )

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం ఆసరా ఇవ్వాలని దృఢసంకల్పంతో ప్రతి నెల రూ.4016లను ఇస్తుంది.

పింఛను కోసం వికలాంగురాలి ఎదురుచూపులు..
X

దిశ, ఖానాపూర్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం ఆసరా ఇవ్వాలని దృఢసంకల్పంతో ప్రతి నెల రూ.4016లను ఇస్తుంది. కానీ అన్ని ఉన్న(ఆసరా) వికలాంగుల పింఛన్ అందాకా ఒక వృద్ధ వికలాంగురాలు ప్రభుత్వం పింఛన్ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ వేడికుంటుంది. కానీ అధికారులు చలించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కు చెందిన చొప్పకట్ల(జ్యోతి) రాజమణి(65) అనే వికలాంగురాలు ప్రభుత్వ పింఛను కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతుంది. రాజమణి గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.

నడుముకు బలమైన గాయం కావడంతో నడవలేక మంచానికే పరిమితం అయింది. మరొక వ్యక్తి సహాయం లేకపోతే ఎలాంటి వ్యక్తిగత పని చేసుకోలేని పరిస్థితి ఉంది. వీల్ చైర్ లో కూర్చుని ఉంటుంది. ఆమెకు మెడికల్ బోర్డు 2023లో 90 శాతంతో వికలాంగుల సర్టిఫికెట్ అందించిందని కానీ తనకు ప్రభుత్వం నుంచి వికలాంగుల పింఛన్ రావడం లేదని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పలుమార్లు లిఖితపూర్వకంగా విన్నపం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్న ఫలితం లేకపోయిందని ఆమె తెలిపారు.

ఖానాపూర్ లో ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన అధికారులు మాత్రం కరుణించలేదు. డాక్టర్లు నుంచి వికలాంగుల సర్టిఫికెట్ ఉన్న కూడా పింఛన్ రావడం లేదు. ప్రతి రోజు గోళీలకు, ఇతర ఖర్చులకు కోసం పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం వికలాంగుల పింఛన్ వస్తే కొద్దిగానైనా తనకు ఆసరా ఉంటుందని, అధికారులు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. తాను బతికి ఉండగా ప్రభుత్వ పింఛన్ రావాలని వేడుకుంటుంది.

Next Story