ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత

by Nallavelli.Anjaneyulu |

కొంతమంది చదువుకున్న వాళ్లు,ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు వృద్ధ తల్లిదండ్రుల పట్ల వ్యవహారం చూస్తే మనుషులా రాక్షసుల అనిపిస్తుంది అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాపోయారు.

ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత
X

దిశ, ఆదిలాబాద్ : కొంతమంది చదువుకున్న వాళ్లు,ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు వృద్ధ తల్లిదండ్రుల పట్ల వ్యవహారం చూస్తే మనుషులా రాక్షసుల అనిపిస్తుంది అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాపోయారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో రూ.10వేల కోత బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లు తీసుకువచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా హింసిస్తున్న వారి జీతంలో 15% కోత విధించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా మిగతా వాళ్లు కూడా భయపడేలా చట్టం ఉండాలన్నారు.

Next Story