స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

by Nallavelli.Anjaneyulu |

ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
X

దిశ, మంచిర్యాల : ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా 2002 ఓటర్ జాబితాకు 2025 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసి ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మరణించిన, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. ఇందుకు బూతు స్థాయి ఏజెంట్లను నియమించినట్లు తెలిపారు. బూతు స్థాయి ఏజెంట్లకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఓటరు జాబితాలో డబ్బులు ఓటు ఎవరికైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా తమ ఓటును తొలగించుకోవాలని అన్నారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా ప్రక్రియ కొరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఇందిరమ్మ ఇండ్లు, సిగ్రీగెషన్ షెడ్ల నిర్మాణాలు, త్రాగునీటి సరఫరా, ఉపాధి హామీ కూలీల మొబిలైజేషన్ తదితర అంశాలపై చర్చించారు. పనుల్లో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాసరావు దేశ్పాండే, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గణపతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story