- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇంటి పిల్లర్ల గుంతలో పడి అంగన్ వాడి చిన్నారి మృతి
దిశ,పెంబి : నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్ గ్రామంలో తీవ్ర విషాదం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం రేణుక, రాముల దంపతుల ఐదేళ్ల కూతురు పుష్ప విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది.

దిశ,పెంబి : నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్ గ్రామంలో తీవ్ర విషాదం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం రేణుక, రాముల దంపతుల ఐదేళ్ల కూతురు పుష్ప విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సుమారు మూడున్నర గంటల సమయంలో పుష్ప ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ల గుంతలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ఆ గుంతలో నీరు నిండిపోవడంతో చిన్నారి మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ కార్యదర్శి అనిల్‌కుమార్ తెలిపారు. ఈ విషయం దాదాపు 3 గంటల 55 నిమిషాలకు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి, చిన్నారిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేదన్నారు. తమ ముద్దుల కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్థులు ఈ విషాదానికి అంగన్ వాడి టీచర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. చిన్నారి అంగన్వాడి కేంద్రంలో ఉండాల్సినప్పటికీ టీచర్ పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ఇన్‌చార్జి సీడీపీఓ శ్రీలత స్పందిస్తూ.. “చిన్నారి మృతి విషాదకరం. ఘటన జరిగిన సమయంపై స్పష్టత కోసం విచారణ జరుగుతోంది. అంగన్ వాడీ టీచర్ నాలుగు గంటలకు చిన్నారిని ఇంటికి పంపించానని తెలిపింది. ఎలా జరిగిందనేది దర్యాప్తుతో తేలుస్తాం. నిర్లక్ష్యం నిరూపితమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.






