- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడిపై ఫోక్సో కేసు నమోదు..
by Kodari Anjali |
మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

X
దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ పంపించినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలంలోని నార్లపూర్ గ్రామానికి చెందిన సాయికృష్ణ గతకొన్ని రోజులుగా కెరమెరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక స్కూల్‌కు వెళ్తుండగా వెంటపడటంతో పాటు ఫోన్ చేసి, లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయికృష్ణపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ప్రేమ పేరుతో బాలికల వెంటపడి వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆకతాయిలను ఎస్సై హెచ్చరించారు. అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే, నిర్భయంగా పోలిసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Next Story






