- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామడలో కాలి బూడిదైన మొక్కజొన్న పంట
by Ratna Kumari |
మామడ మండల కేంద్రానికి చెందిన రైతు కొండ్ర రమేష్ వేసిన ఎకరం మొక్కజొన్న పంట ఆదివారం ప్రమాదవశాత్తు కాలి బూడిద అయింది.

X
దిశ, మామడ : చేతికి వచ్చిన మొక్కజొన్న పంట కళ్ల ముందే కాలిపోతుంటే రైతు కన్నీరు కారుస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నిత్యం మొక్కజొన్న పంటలు ఏదో ఒక విధంగా దగ్దమవుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా మామడ మండల కేంద్రానికి చెందిన రైతు కొండ్ర రమేష్ ఎకరం పొలంలో మొక్కజొన్న పంట వేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్దం అయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ ఆదివారం మధ్యాహ్నం రైతు చేను వద్దకు వచ్చి చూసే సరికి ఎకరం మొక్కజొన్న పంట కాలీ బూడిద అయింది. తమ పంట కాలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పులు చేసి పంట సాగు చేశానని.. ప్రభుత్వం తమను ఆదుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
Next Story






