గోశాలకి ఎద్దు బహుకరణ...

by Kodari Anjali |

కుటుంబ సభ్యులలో ఒకరిగా పెంచుకున్న ఎద్దును ఆదివారం పట్టణంలోని గోశాలకు షేక్ వాహిద్ అనే వ్యక్తి బహుకరణగా అందించారు.

గోశాలకి ఎద్దు బహుకరణ...
X

దిశ, బైంసా: తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా పెంచుకున్న ఎద్దును ఆదివారం పట్టణంలోని గోశాలకు బహుకరణగా అందించారు. వివరాల్లోకెళితే.. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందినటువంటి షేక్ వాహిద్ గత 16 సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా పెంచుకున్నటువంటి ఎద్దును నేడు గోశాలకు బహుకరణ చేసి, జంతు ప్రేమను చాటుకున్నారు. మూగజీవాలను మచ్చిక చేసుకున్నాక, వాటి చివరి శ్వాస వరకు జీవించేలా చూడాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

Next Story