బాత్ రూమ్ లో కాలు జారి బైకు మెకానిక్ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ల‌క్షెట్టిపేట : బాత్ రూమ్ లో కాలుజారి కింద ప‌డ‌టంతో బైకు మెకానిక్ మృతి చెందిన ఘ‌ట‌న‌ ల‌క్షెట్టిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గోప‌తి సురేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌

బాత్ రూమ్ లో కాలు జారి బైకు మెకానిక్ మృతి
X

దిశ‌, ల‌క్షెట్టిపేట : బాత్ రూమ్ లో కాలుజారి కింద ప‌డ‌టంతో బైకు మెకానిక్ మృతి చెందిన ఘ‌ట‌న‌ ల‌క్షెట్టిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గోప‌తి సురేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌ట్ట‌ణంలోని ఆంధ్రా బోర్ కి చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల స‌త్య‌నారాయ‌ణ‌(50) అక్టోబ‌ర్ 30న బాత్ రూమ్ లో కాలు జారి ప‌డ్డాడు. బీపీ ఎక్కువ కావ‌డంతో కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి త‌ల‌లో బ్ల‌డ్ క్లాట్ అయింద‌ని తేల్చ‌డంతో మెరుగైన వైద్యం కోసం క‌రీంన‌గ‌ర్ ప్ర‌తిమ హాస్పిట‌ల్ లో చేర్పించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించాడు. మృతునికి భార్య‌, ఇద్ద‌రూ పిల్ల‌లున్నారు. మృతుని అన్న ఎర్రోజుల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story