8 లీటర్ల గుడుంబా పట్టివేత.. కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ గుడిహత్నూర్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని నేరడిగోండ తాండలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్పెషల్ బ్రాంచ్

8 లీటర్ల గుడుంబా పట్టివేత.. కేసు నమోదు
X

దిశ గుడిహత్నూర్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని నేరడిగోండ తాండలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేరడిగొండ తాండలో తనిఖీలు నిర్వహించ‌గా.. 8 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, గుడుంబా అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హాని కలిగించే గుడుంబా అమ్మడం, గంజాయి పండించి రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ముఖ్యంగా హెల్మెట్ ధరించి ప్రాణనష్టాన్ని తగ్గించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీ లలో సరైన ధృవపత్రాలు లేనటువంటి 27 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్లు, తాత్కాలికంగా స్వాధీన పరుచుకున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ బి.రాజు, ఎస్సైలు శ్రీకాంత్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

Next Story