- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులం పేరుతో దూషించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష.
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : కులం పేరుతో దూషించిన ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ గురువారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.

X
దిశ, ఆసిఫాబాద్ : కులం పేరుతో దూషించిన ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ గురువారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ రూరల్ మండలం బట్టుపల్లి గ్రామంలో 01.03.2020లో కుటుంబ వేడుక జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బొమ్మేళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు నేరం రుజువుకావడంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి అతనికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా కృషి చేసిన పోలిస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
Next Story






