బెజ్జూరులో 48 పశువులు పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..

by Ratna Kumari |

దిశ, బెజ్జూర్ : ప‌శువుల‌ను అక్ర‌మంగా త‌రలిస్తున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌రుణంలోనే

బెజ్జూరులో 48 పశువులు పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..
X

దిశ, బెజ్జూర్ : ప‌శువుల‌ను అక్ర‌మంగా త‌రలిస్తున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌రుణంలోనే బెజ్జూరు మండలంలోని ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో 48 పశువులను మంగళవారం పట్టుకున్నట్లు బెజ్జూర్ ఎస్సై సర్దాజ్ పాషా తెలిపారు. బెజ్జూరు మండలం ఇప్పలగూడ ప్రాంతం నుండి ఇ ప్పలగూడ గ్రామానికి చెందిన పెగడపల్లి సురేష్, తగరం ఆనందరావులో మహారాష్ట్ర నుంచి పశువులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తుండగా, ఇప్పలగూడ ప్రాంతంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సర్దాజ్ పాషా తెలిపారు.

Next Story